PM Modi: కోపెన్ హాగన్ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ

Continues below advertisement

‘లోక కల్యాణం కోసం నా దేశం వేల సంవత్సరాల ముందే ఓ మంత్రాన్ని ఈ ప్రపంచానికి అందించింది. ఇప్పుడు 21వ శతాబ్దంలో ఆ మంత్రానికి మరింత ఆవశ్యకత ఏర్పడింది. సంఘచ్ఛద్వం సంవాదద్వం సంవో మనాంసి జానతం...! సంఘచ్ఛద్వం అంటే సంఘంతో కలిసి నడవండి. సంవాదద్వం అంటే అందరితో మనస్ఫూర్తిగా మాట్లాడండి. సంవో మనాంసి జానతం అంటే అందరి మనసులకు దగ్గరగా బతకండి. వాతావరణ మార్పు సదస్సు కోసం మొదటిసారి పారిస్ కి వచ్చినప్పటి నుంచి ఒకటే అనుకుంటున్నా. ప్రపంచానికి సమస్యలుగా మారుతున్న కారణాల్లో భారత్ ఒకటి కాకూడదని. ఎందుకంటే మాకు సర్వేజనా సుఖినోభవంతు అనుకోవటమే మాత్రమే వచ్చు. నేను అలాంటి సంస్కృతి ఉన్న దేశానికి ప్రతినిధిని’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram