Indian Navy: ఇండియన్ నేవీలోకి నాలుగు కొత్త మిస్సైల్ విధ్వంసకారిణులు
రోజురోజుకూ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న ఇండియన్ నేవీ... కొత్తగా చేరిన నాలుగు క్షిపణి విధ్వంసకారిణులతో మరింత శక్తిమంతంగా తయారైంది. వై-12704 ప్రాజెక్టు 15బీలో భాగంగా ముంబైలోని మాజ్ గావ్ డాక్ యార్డ్ లిమిటెడ్ తయారుచేసిన ఈ నౌకలను అక్టోబర్ 28న ఇండియన్ నేవీకి అప్పగించింది. తొలినౌక విశాఖపట్నానికి చేరుకుంది. హిందూ మహాసముద్రం వెంబడి ఉన్న నాలుగు కీలక తీరప్రాంతాలైన విశాఖ, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ లో వీటిని మోహరించనున్నారు. 163 మీటర్ల పొడవు 7,400 టన్నుల ఫుల్ లోడ్ సామర్థ్యంతో పనిచేసే ఈ నౌక 30 నాట్ల వేగంతో ప్రయాణించగలుగుతాయి. కొవిడ్ ప్రతికూలతల్లోనూ ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఎక్కువశాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరినీ అభినందించిన ఇండియన్ నేవీ... హిందూ సముద్ర పరిధిలో భారత సామర్థ్యాన్ని ఇది రెట్టింపు చేస్తుందని అభిప్రాయపడింది.