Haryana IPS officer Puran Kumar Mystery | ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ కేసులో ట్విస్ట్ | ABP Desam

Continues below advertisement

హర్యానాలో జరిగిన ఒక సంఘటన ఇప్పడు ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుంది. ఒక ఇండియన్‌ పోలీస్ సర్వీస్ అధికారి బలవన్మరణానికి పాల్పడిన ఘటనతో హర్యానా రాష్ట్రం ఉలిక్కిపడింది. చండీగఢ్‌లోని తన నివాసంలో ... తన రివాల్వర్‌ సహాయంతో హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పూరన్ కుమార్ బలవన్మరణానికి పాల్పడాడు. 
అంత పెద్ద పోజిషన్ లో ఉండి ... ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒక వ్యక్తి ఇలా చేయడం చిన్న విషయం ఎం కాదు. 

హర్యానాలో ఏడీజీపీగా పనిచేస్తున్న వై పూరన్ కుమార్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌. సెక్టార్ 11లోని తన ప్రభుత్వ నివాసంలో అక్టోబర్ 7వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి ? వ్యక్తిగత కారణాలా... లేదా వృత్తిపరమైన ఒత్తిడా ? అసలు ఎం జరిగిందన నిజం తెలుసుకోవడానికి దేశం మొత్తం ఎదురు చూస్తుంది. 

పూరన్ కుమార్ ఇంట్లో ఎనిమిది పేజీల లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆ లెటర్ లో ఎన్నో విషయాలను పూరన్ కుమార్ వివరించారు. డీజీపీ శత్రుజిత్ కపూర్, ఎస్పీ బిజర్నియాతో పాటు మరికొంతమంది పేర్లను రాసారు. వారిలో కొంతమంది గురించి మంచిగా రాసుకొస్తే... మరికొంతమంది తనను మానసికంగా కరప్షన్ పేరుతో వేధిస్తున్నారని, అధికార దుర్వినియోగం, బహిరంగ అవమానం, కులం పేరుతో దూషిస్తున్నారని ఆరోపించారు. ఆగస్టు 2020 నుండి ఇప్పటివరకు ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆ లెటర్ లో అయిన ప్రస్తావించారు.

డీజీపీ శత్రుజిత్ కపూర్ పేరు లేఖలో ఉండడంతో ప్రభుత్వం అయనను వెంటనే సెలవులపై పంపించింది. ఎస్పీ బిజర్నియాను వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసారు. పూరన్ కుమార్ ఇంట్లో లేక దొరికిన కొన్ని గంటలోనే ఇవి జరిగిపొయ్యాయి. ఇలా వీరిని ఇంత సడన్ గా బదిలీ చేయడానికి కారణం ఏంటి ? దాంతో ఈ విషయం ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అసలు పోలీసులు ఎం దాస్తున్నారని ప్రజల్లో ప్రశ్న మొదలయింది.    

ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా... పూరన్ కుమార్ దహన సంస్కారాలు పూర్తి కాలేదు. అయిన పార్థివదేహాన్ని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మార్చురీలోనే ఉంచారు. పోస్ట్‌మార్టంకు కుటుంబం ఇంకా అనుమతి ఇవ్వలేదు. పురాణ్ కుమార్‌ భార్య అమ్నీత్ పి కుమార్ కూడా IAS అధికారి. లేకలో తన భర్త పేర్కొన్న డిజిపి శత్రుజీత్ కపూర్, ఎస్పీ నరేంద్ర బిజార్నియాలను అరెస్టు చేస్తేనే... పోస్ట్‌మార్టంకు అనుమతి ఇస్తామని తేల్చి చెపింది. 

పోస్ట్‌మార్టం కోసం అమ్నీత్ కుమార్ ను ఒప్పించడానికి హర్యానా ప్రభుత్వం దిగి వచ్చింది. సీఎం వచ్చి హామీ ఇచ్చినా కూడా పూరణ్ భార్య మాత్రం ఇందుకు ఒప్పుకోనని చెపింది. పూరన్ కుమార్ కూతురికి ప్రభుత్వ ఉద్యోగం, ఎక్స్ గ్రేషియా కూడా ఇస్తామని ప్రభుత్వం చేపినట్టుగా తెలుస్తుంది. కానీ వాటన్నిటిని కూడా అమ్నీత్ కుమార్ రిజెక్ట్ చేశారట. 

చండీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కన్వర్దీప్ కౌర్‌కు అమ్నీత్ పి కుమార్ లేఖ రాశారు. FIR లో "incomplete information" ఉందని ప్రశ్నిస్తూ, నిందితులందరి పేర్లను ఖచ్చితంగా చేర్చాలని డిమాండ్ చేశారు. అమ్నీత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎఫ్ఐఆర్ అక్టోబర్ 10వ తేదీన మళ్ళి సవరించబడింది. 

ఈ సంఘటన ఇంకా కొనసాగుతున్న టైంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పూరన్ కుమార్ పై అవినీతి ఆరోపణలు చేసిన ASI సందీప్ 
కూడా బలవన్మరణానికి పాల్పడాడు. 

ఒక లెటర్ తోపాటు వీడియోను కూడా రిలీజ్ చేసారు. ఆ వీడియోలో పూరన్ కుమార్ ను 'కరప్ట్ అధికారి' అని ఆరోపించిన సందీప్, తన బలవన్మరణానికి అతని కుటుంబం బాధ్యత వహించాలని పేర్కొన్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పూరన్ కుమార్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న టీమ్‌లో సందీప్ లాథర్ ఉన్నాడు. ఇప్పుడు సందీప్ బలవన్మరణంతో పూరన్ కుమార్ కేసు లింక్ అవడంతో పోలీస్ డిపార్ట్‌మెంట్ లో కలకలం రేగుతోంది. 

సందీప్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూరన్ కుమార్ సూసైడ్ కేసులో కీలక ఇన్వెస్టిగేటర్‌గా ఉన్న సందీప్ ఇలా చేయడం యాదృచ్ఛికమా? లేదా అవినీతి బయటపడకుండా ఉండాలని ఎవరైనా కావాలని ఇలా చేసారా ? అనే ఎనో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.   

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola