Gold used in Ayodhya Ram Mandir | అయోధ్య సెకండ్ ఫేజ్ ప్రారంభం

అయోధ్య రామాలయం సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభం అయ్యాయి. రామ్ మందిర్ లోని మొదటవ అంతస్తులో రామ దర్బార్​ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ అయోధ్య రాముడు కొలువుదీరాడు. ఈ సందర్బంగా రామ మందిర్ నిర్మాణంలో ఉపయోగించిన బంగారం విలువ చెప్పుకొచ్చారు ట్రస్ట్ అధికారులు. 

అయోధ్య రామ మందిర్ నిర్మాణంలో మొత్తం 45 కిలోల బంగారం వినియోగించినట్లుగా తెలిపారు. దీని విలువ దాదాపు 50 కోట్లు ఉంటుంది అని అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌ లో ఉండే  తలుపులు, రాముడి సింహాసనంలో కొంత భాగం బంగారంతో చేసారు. 

ఆలయ మొదటి అంతస్తులో నిర్మించిన రామ్ దర్బార్ లోకి ప్రస్తుతం భక్తులను అనుమతించట్లేదు. ఇందుకోసం కొంతకాలం ఎదురుచూడాలని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఆలయ శిఖరంపై ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సెకండ్ ఫేజ్ లో నిర్మాణం అవుతున్న శేషావతార్ ఆలయంలో బంగారం పని ఈ రోజుకీ జరుగుతుందని ట్రస్ట్ అధికారులు తెలిపారు. ఈ నిర్మాణాలు 2025 డిసెంబర్‌ నాటికి పూర్తి కావొచ్చని భావిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola