Trump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం భారత్ కు అనూకలమా వ్యతిరేకమా ఇప్పుడే చెప్పలేం కానీ ఓ సంగతైతే చెప్పొచ్చు. అదే ట్రంప్ మోదీ ఫ్రెండ్ షిప్. ట్రంప్ చేతిని పట్టుకుని చప్పుడు వచ్చేలా పెడీల్మని కొట్టగల చనువు బహుశా మోదీకి మాత్రమే ఉందేమో. కేవలం వాళ్లిద్దరూ దేశాధినేతలనే కాదు వాళ్లిద్దరి మధ్య వ్యక్తిగతంగానూ ఉన్న మిత్రత్వం అప్పట్లో హాట్ టాపిక్ . ఎంతెలా అంటే ఈసారి ఎన్నికలకు పోలేదు కానీ నాలుగేళ్ల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బహిరంగంగానే ట్రంప్ విజయం కోసం కృషి చేశారు మోదీ. అహ్మదాబాద్ కు అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ను కుటుంబ సమేతంగా ఆహ్వానించి ఏర్పాటు చేయించిన నమస్తే ట్రంప్ ప్రోగ్రాం కానీ లేదా మోదీనే స్వయంగా అమెరికాకు వెళ్లి ట్రంప్ ను గెలిపించాలంటూ హ్యూస్టన్ లో ఏర్పాటు చేసిన హౌడీ మోడీ ప్రోగ్రాం కానీ రెండూ అప్పట్లో సెన్సెషనల్. ఎందుకంటే ఓ దేశాధినేత ఎన్నికల్లో మరో దేశాన్ని నడిపించే వ్యక్తి కలుగ చేసుకోవటం అందునా అమెరికా లాంటి అగ్రరాజ్యానికి సంబంధించిన రాజకీయ అంశాల్లో మోదీ నేరుగా పాలు పంచుకోవటం ఇంటర్నేషనల్ మీడియాలోనూ నాలుగేళ్ల క్రితం పెద్ద డిబేట్ అయ్యింది. కానీ మోదీ ప్రయత్నం వృథా అయ్యింది. ట్రంప్ ఓడిపోయి బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. కానీ భారత్ ప్రపంచ పటంలో పోషిస్తున్న కీలకపాత్ర దృష్ట్యా బైడెన్ అది మనసులో పెట్టుకోలేదు. భారత్ జోలికి రాలేదు. చూస్తుండగానే నాలుగేళ్లు గడిచిపోయాయి. ఈసారి అమెరికా ఎన్నికల ప్రచారానికి మోదీ చాలా దూరంగా ఉన్నారు. కానీ ట్రంప్ విజయం సాధించటంతో రిపబ్లికన్ పార్టీ విధానాలు భారతీయ అమెరికన్లపై, ప్రవాస భారతీయులపై ఎలా ఉంటాయనే భవిష్యత్ భావనలను పక్కనపెడితే వీళ్లిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా అంత హార్ష్ గా ఉండకపోవచ్చు అనేది విశ్లేషకులు చెబుతున్న మాట.