DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP Desam

తమిళనాడు కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న లాంగ్వేజ్ వార్ ఇవాళ పార్లమెంట్‌ను కుదిపేసింది. త్రిభాషా విధానం పేరుతో  బలవంతంగా హిందీని తమపై రుద్దితే సహించేది లేదంటూ తమిళనాడు కొంతకాలంగా అభ్యంతరం చెబుతోంది. National Education Policy పై పార్లమెంట్‌లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. తమిళనాడులో అధికార పార్టీ అయిన DMK విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని, వాళ్లు అప్రజాస్వామికంగా అనాగరికంగా (Uncivilised) గా వ్యవహరిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు.
వచ్చే ఏడాది ఎన్నికలకు డీఎంకేకు ఓ ఎమోషనల్ స్లోగన్ కావాలి. అందుకే హిందీని వాడుకుంటున్నారు అని విమర్శించారు. ఇదే వివాదానికి దారి తీసింది.


 కేంద్రమంత్రి వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్ మండిపడ్డారు.  నిరంకుశంగా హిందీని దక్షణాదిపై రుద్దడమే ప్రధాన అజెండాగా  కేంద్రం పనిచేస్తోందని విమర్శిస్తున్న ఆయన X వేదికగా కేంద్రమంత్రిని హెచ్చరించారు. “మాటల జాగ్రత్తగా మాట్లాడాలి. కేంద్ర ఎడ్యుకేషన్ మంత్రి తనకు తాను ఏదైనా మాట్లాడగలిగే రాజుగా భానిస్తున్నారేమో.. ఆయనకు క్రమశిక్షణ అవసరం ” అన్నారు స్టాలిన్.  మంత్రి వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో కూడా నిరసన వ్యక్తమైంది. డీఎంకే ఎంపీ కనిమొళి మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. తమ రాష్ట్రాన్ని అవమానించారని నిరసన తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola