Dharmashthala case latest update | ధర్మస్థల ముసుసు వీరుడు అరెస్ట్ | ABP Desam

ధర్మస్థల కేసు ఊహించని టర్న్ తీసుకుంది. 100కి పైగా డెడ్ బాడీస్‌ని పూడ్చిపెట్టానన్న ముసుగు వీరుడు రెండు నెలల నుంచి పోలీసులని తన చుట్టూ తిప్పుకుంటూ.. కనీసం ఒక్క డెడ్‌బాడీని కూడా చూపించలేకపోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు.. భీమాని ఇంకోసారి క్రాస్ ఎగ్జామిన్ చేసి.. ఆ విచారణలో బయటపడ్డ వివరాలతో భీమా రియలిటీ అర్థం కావడంతో వెంటనే అరెస్ట్ చేశారు. 


ముసుగు వేసుకున్నాడు. 20 ఏళ్లలో వందల మంది మృతదేహాలని తన చేతులతో పూడ్చిపెట్టానన్నాడు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మర్డర్ మిస్టరీని బయటపెడతానన్నాడు. పోలీసులని, సిట్ అధికారులని రోజుల తరబడి తన వెంట తిప్పుకున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా ధర్మస్థల లాంటి ఓ పుణ్యక్షేత్రంపై భయానకమైన, ఒళ్లు గగుర్పొడిచే ఆరోపణలు చేశాడు. జనాలు కూడా చాలామంది ఇందులో నిజం ఉందనే అనుకున్నారు. ఇక కొన్ని న్యూస్ చానెళ్లైతే.. అదుగో అక్కడ 10 శవాలు దొరికాయి.. ఇక్కడ 40 కంకాణాలు దొరికాయి.. అంత దూరంలో 100 ఎముకలు దొరికాయి.. అని తెగ ఊదరగొట్టాయి. స్పెషల్ ప్రోగ్రామ్‌లు చేశాయి. ఇక యూట్యూబ్ చానెళ్లకి అడ్డూ అదుపూ లేకుండా వీడియోలు చేశాయి. కట్ చేస్తే.. తను పూడ్చి పెట్టిన శవాల్లో ఒక్కదాన్నీ పోలీసులకి చూపించలేకపోయిన సదరు ముసుగు వీరుడిని రీసెంట్‌గా సిట్ అఫీషియల్స్ అరెస్ట్ చేశారు. 

జూలై 3న ఉన్నట్లుండి భీమా ఓ శానిటేషన్ వర్కర్ కర్ణాటక పోలీసుల దగ్గరకొచ్చి.. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ధర్మస్థలలో  1995 నుంచి 2014 మధ్య భయంకరమైన మర్డర్లు జరిగాయని.. దాదాపు 100 మందిని తానే పూడ్చి పెట్టానని షాకింగ్ ఆరోపణలు చేశాడు. వెంటనే గవర్నమెంట్ అలెర్ట్ అయి సిట్ వేసి.. భీమాతో కలిసి ఆ డెడ్ బాడీస్‌ని బయటకి తీయాలని ఆదేశించింది. బట్.. దాదాపు రెండు నెలలు గడుస్తున్నా.. రెండు ఎముకలు, ఓ ఎర్ర క్లాత్ తప్ప ఇంకేం దొరకకపోవడంతో పోలీసులకి భీమా పైనే అనుమానం వచ్చింది. దీంతో భీమానే మళ్లీ క్లియర్‌గా విచారించింది సిట్ టీం. అయితే ఈ విచారణలో భీమా.. ఏ మాత్రం సంబంధం లేని ఆన్సర్స్ చెప్పడంతో.. ఇదంతా అతడు కావాలని క్రియేట్ చేసిన కట్టుకథలని, రాంగ్ ఇన్ఫర్మేషన్‌తో ప్రజల్ని తప్పుదోవ పట్టించాడని అర్థం చేసుకున్న అధికారులు అతడ్ని అరెస్ట్ చేశారు.  ఈ అరెస్ట్‌తో ధర్మ స్థల కేసు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్లైంది. 

సో.. ధర్మస్థల మిస్టరీ ఇలా ముగిసిందన్నమాట. మరి భీమా నిజంగానే అబద్ధాలు చెప్పాడని మీరనుకుంటున్నారా..? లేదంటే అతడి అరెస్ట్ వెనక ఇంకేదైనా రీజన్ ఉందని అనుకుంటున్నారా..? కామెంట్ చేసి చెప్పండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola