Delhi Hits 52.3 Degrees|Record Temperature |ఉష్ణోగ్రతల్లో వందేళ్ల రికార్డు బద్దలు కొట్టిన దిల్లీ |

Continues below advertisement

Delhi Hits 52.3 Degrees|Record Temperature  |

దేశ రాజధాని దిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. అది ఏ స్థాయిలో ఉందంటే..గడిచిన వందేళ్లలో ఎప్పుడు కూడా దిల్లీ అంత వేడిని చూడలేదు. బుధవారం నాడు దిల్లీలో ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్ దాటింది. ఈ నెంబర్ ఇప్పుడు గుబులు పుట్టిస్తోంది. దిల్లీలోని ముంగేష్ పూర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు.. వడగాలులు కూడా గట్టిగా వీస్తున్నాయి. కాబట్టి... అవసరమైతే తప్పా... ప్రజలు ఎవరూ బయటికి రావొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దేశ రాజధాని దిల్లీ ఒక్కటే కాదు.. మొత్తం ఉత్తర భారతమంతా ఉడికిపోతోంది. బిహార్, రాజస్థాన్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ లలోనూ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటేస్తున్నాయి. దీంతో.. చాలా మంది వడదెబ్బలకు ఆసుపత్రి పాలవుతున్నారు. రానున్న 48 గంటలు కూడా వేడి గాలులు డెంజర్ బెల్స్ మోగించనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి.. అత్యవసరమైతే తప్పా జనాలు ఎవరు బయటికి రాకపోవడమే బెటర్ అంటున్నారు.  జూన్ మొదటి వారం కూడా ఈ స్థాయి ఎండలు కొనసాగే అవకాశమున్నట్లు అంచనా. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram