Arvind Kejriwal Resign | పక్కా వ్యూహంతో రాజీనామా చేసి ముందస్తుకు వెళ్తున్న Delhi CM కేజ్రీవాల్ | ABP
అర్వింద్ కేజ్రీవాల్. భారత రాజకీయాల్లో ఓ విభిన్నమైన లక్షణాలు కలిగిన నేత. విశేషమైన ప్రజాదరణ ఉంది. బాగా చదువుకున్న వ్యక్తి. IRS అధికారిగా పనిచేశారు. లోక్ పాల్ బిల్లు కోసం అన్నాహజారే తో కలిసి పోరాడిన ఉద్యమకారుడు. ఇదంతా ఓ సైడ్. రాజకీయ నేతగా మాత్రం కేజ్రీవాల్ వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కవు. భద్ర సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. చదువులేనోళ్లు మీకే అన్ని తెలివితేటలు ఉంటే...చదువుకున్న వాడిని నాకెన్ని తెలివితేటలు ఉండాలి అంటాడు రవితేజ. అచ్చం ఈ డైలాగ్ పాలిటిక్స్ లో యాప్ట్ గా సరిపోతుందేమో కేజ్రీవాల్. లేకపోతే ఏంటీ..అధికారంలో ఉన్న ఏ నేతైనా అధికారాన్ని ఎలా కాపాడుకోవాలి అనుకుంటాడు. అందుకోసం నానా గడ్డీ కరిచి నాయకుల్ని మనం డైలీ లైఫ్ లో చూస్తూనే ఉంటాం. కానీ కేజ్రీవాల్ అలగ్. ఈయన తిక్కలేస్తే అధికారాన్ని ఆయనే వదిలేసుకుంటారు. ప్రజల్లోకి వెళ్తా నా బలాన్ని నిరూపించుకుంటా అంటారు. ఈ రోజు చేసింది కూడా అదే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. తీహార్ జైల్లో పెట్టి జైలు జీవితం అనుభవించేలా చేశారు. జైలులో ఉన్నన్నాళ్లూ ప్రతిపక్షాలది ఒకటే గోల. అసలు జైలు నుంచి కేజ్రీవాల్ పరిపాలన ఎలా చేస్తారు అని. ఆయన తక్షణమే రిజైన్ చేయాలి. కానీ అక్షరాలా ఐదు నెలలు తీహార్ జైలు నుంచే కేజ్రీవాల్ ఢిల్లీని రూల్ చేశారు. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి రెండు రోజులు అయ్యిందో లేదో సంచలన నిర్ణయం. రెండు రోజుల్లో సీఎం పదవికి రిజైన్ చేస్తా అని సంచలన ప్రకటనే చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కూడా పూర్తి చేసుకోకముందే మరో ఐదు నెలల సమయం ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించి ప్రకంపనలే రేపారు కేజ్రీవాల్.