Brahmos Missiles in Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ లో బ్రహ్మాస్త్రాన్ని వాడిన భారత సైన్యం | ABP Desam

ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ పై భారత్ బ్రహ్మోస్ ను వినియోగించిందా. భారత సైన్యం ఎక్కడా అధికారికంగా వెల్లడించిని ఈ విషయాన్ని ఈ రోజు యూపీలో బ్రహ్మోస్ ఫెసిలిటీ  సెంటర్ ఏర్పాటు సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హింట్ ఇచ్చారు. వర్చువల్ పద్ధతిలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కార్యక్రమానికి హాజరై ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్య మాట్లాడుతూ భారత్ క్షిపణులు, ఆయుధాల తయారీలో చాలా దేశాలతో పోలిస్తే చాలా ముందుందన్నారు. బ్రహ్మోస్ లాంటి మేడిన్ ఇండియా క్షిపణుల పవర్ ఏంటో తెలియాలంటే పాకిస్థాన్ ను కనుక్కోవాలంటూ బ్రహ్మోస్ ను ఆపరేషన్ సిందూర్ లో వాడినట్లు హింట్ ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్.ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో అంటే సూపర్ సోనిక్ వేగంతో పనిచేసే ఈ క్షిపణిని భారత్ మేకిన్ ఇండియా కాన్సెప్ట్ లో భాగంగా రష్యా సహకారంతో మన దేశంలోనే తయారు చేసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం డీఆర్డీవో లో ఉన్నప్పుడు. బ్రహ్మోస్, అగ్ని, పృథ్వి లాంటి క్షిపణల తయారీ కలాం కాలంలోనే జరిగింది. 2001లో బ్రహ్మోస్ పూర్తి అయినా అడపాదడపా పరీక్షలు నిర్వహించిందే తప్ప ఎప్పడూ ఎవరి మీదా ప్రయోగించలేదు. గాలిలో, నేల మీద, నీటిలో నుంచి ఈ క్షిపణి ప్రయోగించగలటం ప్రత్యేకత. అబ్దుల్ కలాం ఆశీస్సులతో ఇప్పుడు భారత్ ఆయుధ సంపన్న దేశంగా స్వశక్తితో నిలబడిందన్నారు రాజ్ నాథ్ సింగ్

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola