చెల్లాచెదురైన భాగమతి ఎక్స్‌ప్రెస్, భయంకరంగా డ్రోన్ విజువల్స్

Bagmati Express Train Accident Drone Video: ఏపీ, తెలంగాణ మీదుగా దర్బంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (Bagmati Express) తమిళనాడు తిరువళ్లూరు వద్ద గూడ్స్‌ రైలును ఢీకొని ప్రమాదానికి గురై సంగతి తెలిసిందే. మొత్తం 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే, ఈ ప్రమాదంలో అద్రుష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం కలగలేదని రైల్వే అధికారులు తెలిపారు. కొంత మందికి మాత్రం స్వల్ప గాయాలు అయినట్లు చెప్పారు. సహాయ చర్యల కోసం 30 మందితో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్‌ని చెన్నై అరక్కోణం నుంచి రప్పించారు. ఆహారం, నీరు అందించి వారిని ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానానికి తరలించారు. తాజాగా ప్రమాదపు డ్రోన్ విజువల్స్ (Bagmati Express Train Accident Drone Video) ను విడుదల చేశారు. ఆ ప్రమాదం కారణంగా.. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఆ లిస్టును కూడా దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది.            

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola