Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

 బద్రీనాథ్ లో మంచు చరియలు భారీగా విరిగి పడ్డాయి. బద్రీనాథ్ సమీపంలో మనా గ్రామంలో రహదారి పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా మంచు చరియలు విరిగి పడటంతో వాటి కింద 57మంది కార్మికులు చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు అప్రమత్తమయ్యే సహాయక చర్యలు ప్రారంభించారు. 16మందిని రక్షించి క్యాంప్ కు తరలించారు వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 41మంది ఆచూకీ కోసం అధికారులు వెతుకుతున్నారు. ప్రమాదం జరిగిన మన గ్రామంలో బద్రీనాథ్ కు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రమాదంపై స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ ట్రూపులను కూడా సహాయకచర్యల్లోకి దింపుతున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. ఘటన జరిగిన ప్రాంతం ఇండియా టిబెట్ సరిహద్దుకు చాలా దగ్గర ప్రాంతంగా ఉంది. అవసమరైన పక్షంలో టిబెట్ బోర్డర్ ఫోర్స్ ను రంగంలోకి దింపుతామని  సీఎం తెలిపారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola