Ayodhya Ram lalla Face Revealed : అయోధ్య బాలరాముడి నిజరూప దర్శనం | ABP Desam
ఈనెల 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంది. ఇప్పటికే గర్భగుడికి చేరుకున్న రామ్ లల్లా విగ్రహం ఒక్కరోజులోనే వివిధ రకాలుగా ఆవిష్కృతమైంది. ఉదయం విగ్రహం మొత్తం వస్త్రంతో కప్పివేసి ఉంచగా..మధ్యాహ్నానికి కళ్లు మినహా మిగిలిన విగ్రహం కనిపించేలా ఉంచారు. సాయంత్రానికి స్వామివారి నిజరూపదర్శనం కలిగేలా విగ్రహంపై ఉంచిన వస్త్రాలను తొలగించారు.