కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడు

Continues below advertisement

Arvind Kejriwal Attacked by Chemical: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి రసాయనంతో దాడికి యత్నించాడు. దక్షిణ ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌కి అందరూ ఘన స్వాగతం పలుకుతుండగా.. చాలా మంది దండలు వేసి తిలకం దిద్దుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి బాగా చేరువలోకి వచ్చి.. ఓ గ్లాసుతో ద్రావణాన్ని పోయబోయాడు. మెరుపు వేగంతో స్పందించిన కేజ్రీవాల్ భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అయినప్పటికీ కొంత ద్రావణం కేజ్రీవాల్‌ పైన పడింది. దీంతో అక్కడున్న ఆప్‌ కార్యకర్తలు నిందితుడిని పట్టుకొని పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు. బాగా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే, అతడు ఏ ద్రావణం పోశాడన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అతను ఏ ఉద్దేశంతో ఆ ద్రావణం పోశాడనే అంశం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.                          

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram