AAP Huge Loss in Haryana Elections | కేజ్రీవాల్ కు హర్యానాలో ఊహించని దెబ్బ | ABP Desam

Continues below advertisement

  ఢిల్లీ అయిపోయింది..పంజాబూ కైవసం అయ్యింది. ఇక మిగిలిన టార్గెట్ హర్యానా. అందుకే కేజ్రీవాల్ ను సరికొత్తగా హర్యానా ప్రజలకు చేరువ చేయాలని ప్లాన్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. అందులో భాగంగా ఎత్తుకున్న నినాదమే సన్ ఆఫ్ సాయిల్. అంటే ఈ మట్టి కన్న కొడుకు అని అర్థం. ఎందుకంటే కేజ్రీవాల్ పుట్టింది హర్యాలోని శివాని అనే ప్రాంతంలోనే. అలాంటి కేజ్రీవాల్ ఢిల్లీ, పంజాబ్ ల్లోనే తన పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగినప్పుడు వై నాట్ హర్యానా అనుకున్నారు ఏడాది క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. కానీ కథ అడ్డం తిరిగింది. ఢిల్లీలిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా మనీశ్ సిసోడియా తో పాటు ఏకంగా కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవ్వటం జైలు జీవితం గడపటంతో హర్యానా ఎన్నికల సంగతి పక్కన పెడితే ఢిల్లీలోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.  ఎన్నికల మూడు వారాల ముందు కేజ్రీవాల్ కు బెయిల్ రావటంతో హర్యానాలో ఆయన రోడ్ షో నిర్వహించారు. కానీ దానికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను 89 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినా ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. చాలా చోట్ల ఆప్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. మొత్తంగా రాష్ట్రం మొత్తం వచ్చిన ఓట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ 1.76 శాతం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా కేజ్రీవాల్ ప్లాన్స్ అన్నీ హర్యానాలో విఫలమయ్యాయో. కానీ ఊహించని విధంగా జమ్ముకశ్మీర్ లో బోణీ కొట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీ అక్కడ పెద్దగా ఫోకస్ పెట్టకపోయినా...డోడా నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ విజయం సాధించటం ఒక్కటే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో చీపురు పార్టీకి ఊరట

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram