Artificial Rain Failure in Delhi | Cloud Seeding | క్లౌడ్ సీడింగ్ ఫెయిల్యూర్ కి కారణాలు ఇవే ! | ABP Desam

Continues below advertisement

దేశ రాజధాని ఢిల్లీని చలికాలంలో వేధించే వాయు కాలుష్యం గురించి మనందరికీ తెలిసిందే. Air Quality Index (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో, దానిని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదే Artificial Rain. క్లౌడ్ సీడింగ్ అని కూడా అనొచ్చు. Artificial Rain ఎలా వస్తాయి. అసలు ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ఎందుకు ఫెయిల్ అయిందో పూర్తిగా తెలుసుకుందాం. 

మేఘాలలో సహజంగా నీటి ఆవిరి, తేమ ఉంటాయి. కానీ వర్షంగా మారడానికి కొన్నిసార్లు అవి సరిపోవు. అప్పుడు ఈ క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాలను రాబటోచు. క్లౌడ్ సీడింగ్ అంటే మేఘాలలోకి ప్రత్యేక రసాయనాలను విమానాల ద్వారా చల్లుతారు. సిల్వర్ అయోడైడ్, లేదా పొటాషియం అయోడైడ్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు మేఘాలలో మోయిస్ట్ పార్టికిల్స్ ను ఆకర్షించి.. పెద్ద rain drop గా మారుతాయి. అవి భూమిపైకి వర్షంగా కురుస్తాయి! ఈ ప్రయోగం విజయవంతం కావాలంటే, మేఘాలలో కనీసం 50% తేమ ఉండాలి. ఇదే క్లౌడ్ సీడింగ్.  

ఇక ఢిల్లీ విషయానికి వస్తే...  దీపావళి తర్వాత, చుట్టుపక్కల రాష్ట్రాల పొగ, వాహనాల కాలుష్యం, చలి ప్రభావంతో గాలి విషపూరితంగా మారింది. ఢిల్లీ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దాంతో ఢిల్లీ ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ ఐడియాతో ఎయిర్ క్వాలిటీని పెంచాలని అనుకున్నారు. 

ఇందుకోసమని ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ సైంటిస్ట్స్ తో కలిసి క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టును చేపట్టింది. కొన్ని ప్రాంతాల్లో ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రతి ట్రయల్‌కి సుమారుగా 35–64 లక్షలు ఖర్చు అయ్యింది. మొత్తం ట్రయల్స్‌ కోసం 3 కోట్లకు పైగానే ఖర్చు చేసిందట. 

ఫుల్ కాన్ఫిడెన్స్ తో... ఢిల్లీ మొదటి ఆర్టిఫిసియల్ వర్షాన్ని అందుకోవడానికి సిద్ధమైంది. కానీ అక్కడ జరిగింది మాత్రం వేరే. కోట్ల రూపాయల పెట్టుబడి అంతా ఆకాశంలో పోసిన పన్నీరైంది. ఒక్క చుక్క వర్షం కూడా రాలేదు. అక్కడి మేఘాలలో తేమ 10–20% ఉందట. కానీ క్లౌడ్‌ సీడింగ్‌కు 50% పైగా తేమ అవసరం అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 

క్లౌడ్ సీడింగ్ ప్రయోగం విఫలం అవడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది.. మేఘాలలో తేమ లేకపోవడం. ఢిల్లీలో మాత్రం 10 నుంచి 20% ఉండటంతో... కెమికల్స్ వాటర్ డ్రాప్లెట్స్ ను పెద్ద సైజ్ లోకి మార్చలేక పొయ్యాయి. 

రెండవది సరైన Ideal Clouds లేకపోవడం. వర్షం రావడానికి కావాల్సిన నింబోస్ట్రాటస్ మేఘాలు లేకపోవడం కూడా వైఫల్యానికి దారితీసింది.ఈ ప్రయోగాలు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. కొంచం డేట్స్ అటు.. ఇటు అయినా కూడా క్లౌడ్స్ ఉండవు. పర్మిషన్స్ డిలే... డేట్స్ వల్ల అనుకూల వాతావరణ పరిస్థితులు లేక ప్రయోగం వాయిదా పడుతుంది. 

నిజానికి Artificial Rain అనేది ఎయిర్ పొల్యూషన్ కి ఒక తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ఈ ప్రయోగం సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా, ఢిల్లీ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి శాశ్వత చర్యలు చెప్పటాలి. ఉదారణకు vehicle pollution తగ్గించడం.. industries, smog నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడం వంటివి చేయాలి. కఠిన చర్యలు తీసుకుంటే తప్పా ఢిల్లీ కాలుష్యాన్ని కంట్రోల్ చేయలేరు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola