Anant Ambani Dwarka Padyatra | హెలికాఫ్టర్లు వద్దంటూ కాలినడకన కృష్ణుడి గుడికి అంబానీ వారసుడు | ABP Desam

విన్నారుగా..హనుమాన్ చాలీసా ను గట్టిగా పఠిస్తూ రామ నామం..కృష్ణుడి మంత్రం చదువుకుంటూ ఈ పాదయాత్ర చేస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారుగా. ఎస్ ఈయన అనంత్ అంబానీ. లక్షల కోట్లకు అధిపతైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు. తనెంత ధనవంతుడినైనా ఆ దేవుడికి మాత్రం సాధారణ భక్తుడిని అని చెప్పే అనంత్ అంబానీ మరోసారి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏప్రిల్ 10వ తారీఖుకు తనకు 30ఏళ్లు నిండుతున్న సందర్భంగా తన పుట్టినరోజును ద్వారకలో శ్రీకృష్ణుడి మందిరంలో జరుపుకోవాలని సంకల్పం తీసుకున్నారు అనంత్ అంబానీ. ఇందుకోసం ఆయన తమ పూర్వీకుల ఊరైన జామ్ నగర్ నుంచి ద్వారకకు 160కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు. అంబానీ వారసుడిగా అత్యంత భద్రతలో గడపాల్సిన వ్యక్తి తనకు అవేమీ వద్దని కృష్ణుడి ఆశీర్వాదం కావాలంటూ జామ్ నగర్ నుంచి నడకను ప్రారంభించారు. రోజుకు 10 నుంచి 20 కిలోమీటర్ల వరకూ నడుస్తూ పదో తారీఖు నాటికి ద్వారక చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆస్తమాతో బాధపడుతున్న అనంత్ అంబానీ అంత దూరం కాలినడకన నడవటం కష్టమైనా...ఆస్తమా కారణంగా వచ్చిన ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నా అవేవీ లక్ష్యపెట్టకుండా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు అనంత్ అంబానీ.  మార్గమధ్యంలో ఉన్న గుడులు, గోపురాలు దర్శించుకుంటూ రోజుకు 15-20 కిలోమీటర్ల చొప్పున నడుస్తున్నారు అనంత్ అంబానీ. యువతరం సనాతన ధర్మంపై నమ్మకం ఉంచాలని..మనం చేయలేం అనుకునే పనులు కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉంటే పూర్తి చేయొచ్చని నిరూపించేందుకే తనకు ఆరోగ్యపరంగా పాదయాత్ర చేయటం కష్టమైనా చేస్తున్నానని చెప్పారు అనంత్ అంబానీ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola