
Amit Shah Prayagraj Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో అమిత్ షా | ABP Desam
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగరాజ్ కు చేరుకున్న అమిత్ షా కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రయాగరాజ్ లో సీఎం యోగితో కాసేపు సమావేశమైన అమిత్ షా...కుంభమేళా ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం సాధువులతో మహాకుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. అమిత్ షా పై నీళ్లు చల్లుతూ యోగి ఆదిత్యనాథ్ సరదాగా ఆటపట్టించగా మిగిలిన సాధువులు అమిత్ షా నీళ్లు చల్లి ఆశీర్వచనాలు అందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగరాజ్ కు చేరుకున్న అమిత్ షా కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రయాగరాజ్ లో సీఎం యోగితో కాసేపు సమావేశమైన అమిత్ షా...కుంభమేళా ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం సాధువులతో మహాకుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. అమిత్ షా పై నీళ్లు చల్లుతూ యోగి ఆదిత్యనాథ్ సరదాగా ఆటపట్టించగా మిగిలిన సాధువులు అమిత్ షా నీళ్లు చల్లి ఆశీర్వచనాలు అందించారు.