మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లై
ప్రతి రోజూ.. రోజులో 24 గంటలు ఎంతో బిజిగా గడిపే ప్రధాని నరేంద్ర మోదీ.. ఎప్పుడైనా పాటలు వింటారా? అసలు అంత తీరిక సమయం ఆయనకు దొరుకుతుందా? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ, ఈ ప్రశ్నకు స్వయంగా ప్రధాని సమాధానం చెప్పారు. అలియా భట్ ఈ ప్రశ్న చేసింది. మ్యూజిక్ వినడానికి మీకు టైం దొరుకుతుందా? అని అడిగింది. ఇటీవల ఆఫ్రికాలో తన పాట పాడుతున్న ఓ సైనికుడితో మోదీ నిలబడి ఉన్న క్లిప్ ను చూశానని ఆలియా చెప్పింది. దీనిపై మోదీ స్పందిస్తూ.. తాను మ్యూజిక్ వింటానని చెప్పారు. ఎందుకంటే.. పాటలు వినడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు. రాజ్ కపూర్ 100 ఫిల్మ్ ఫెస్టివల్ కు సంబంధించిన ప్రత్యేక సమావేశం ఢిల్లీలో జరిగింది. ప్రధాని మోదీతో జరిగిన ఈ ఇంటరాక్షన్ లో రణ్ బీర్ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, నీతూ కపూర్, రిద్ధిమా కపూర్ సాహ్నితో సహా కపూర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.