
Ajith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam
తలా అజిత్ సినిమాలే కాకుండా తనకెంతో ఇష్టమైన కార్ రేస్ లోనూ విజేత అని నిరూపించుకున్నారు. దుబాయ్ లో జరుగుతున్న 24 హవర్స్ కార్ రేస్ లో తలా అజిత్ టీమ్ పాల్గొనగా 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 992 పోర్షే కార్ విభాగంలో థర్డ్ ప్లేస్ ను కైవసం చేసుకుంది అజిత్ టీమ్. ఈ పోటీల్లో పాల్గొనాలనే అజిత్ కార్ రేస్ పేరుతో ఏకంగా రేసింగ్ టీమ్ నే కొనుగోలు చేశారు. ఇండియా నుంచి రిప్రసెంట్ చేస్తున్న ఏకైక టీమ్ గా అజిత్ కార్ రేస్ టీమ్ నిలిచింది. ప్రాక్టీస్ సెషన్స్ లో అజిత్ కారు క్రాష్ కాగా ఆయన ఎలాంటి గాయాలు లేకుండా బయటపడి రేసులో పాల్గొన్నారు. ఫలితంగా అజిత్ స్పిరిట్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా దక్కింది. విజయం సాధించిన తర్వాత అజిత్ త్రివర్ణపతాకాన్ని దుబాయ్ లో రెపరెపలాడించారు. తన కొడుకుతో కలిసి పోడియంపై ట్రోఫీని అందుకున్నారు. అజిత్ సాధించిన విజయంపై తమిళ్ సినిమా సెలబ్రెటీలు అభినందిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.