Ahmedabad Plane Crash | ఎయిర్ ఇండియా ప్రమాదంలో స్టార్ హీరో స్నేహితుడు మృతి
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఏకంగా 241 మంది మరణించారు. విమానం కూలిన బిల్డింగ్‌లోని మెడికల్ విద్యార్థులు కూడా కొంతమంది మృతి చెందారు. ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ప్రముఖ హీరో సోదరుడు మృతి చెందాడు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 కో పైలెట్ క్లైవ్ కుందర్ బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే బంధువు. ఈ విషయాన్ని విక్రాంత్ మాస్సే తన ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. “అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. నా మామ క్లిఫోర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయాడని తెలిసింది. ఈ ఫ్లైట్ లో తనే ఆఫీసర్ అని తెలిసిందని ఇంస్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చారు విక్రాంత్ మాస్సే.
కానీ కొద్దీ సేపటి తర్వాత ఎయిర్ క్రాష్ లో చనిపోయిన పైలెట్ తన మామ క్లివ్ కుమారుడు కాదని విక్రాంత్ ఇంస్టాగ్రామ్ వేదికగా కన్ఫర్మ్ చేసారు. కుందర్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే అని రాసుకొచ్చారు విక్రాంత్. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా మరణించారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా మరణించారు.