Adani Speech on Puri Jagannath Seva | అదానీ 'సేవా సే సాధన' కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే | ABP Desam

 పూరీ జగన్నాథ స్వామి సేవలో అదానీ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అదానీ సేవా సే సాధన కార్యక్రమం ఉద్దేశాన్ని తెలిపారు.మహా కుంభమేళాలో తొలిసారి అదానీ సంస్థల తరపున 'సేవా సే సాధన' కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మా సంస్థల్లో మాతో కలిసి పనిచేసే 5వేల మందికి పైగా ఆ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమంలో భాగం అవ్వటంలో వాళ్ల జీవితాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇది కేవలం ధార్మిక కార్యక్రమమే కాదు అంతకు మించి అనే చెప్పాలి. కార్పొరేట్ ప్రపంచానికి చెందిన ఉద్యోగులకు ఇది దోహదపడుతుంది. పూరీ జగన్నాథుడి రథయాత్రలో ఇంతకు మించి సేవ చేయాలని అప్పుడే అనుకున్నాం.  నేను ఇక్కడ వ్యవస్థ మొత్తం పరిశీలించాను. ఒడిషా ప్రభుత్వం, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు అందరూ కలిసికట్టుగా రథయాత్రను విజయవంతం చేస్తున్నారు. నేను వాళ్లందరినీ అభినందిస్తున్నాని అదానీ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ మీడియాకు తెలిపారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola