ABP Southern Rising Summit 2025 Begins | ప్రారంభమైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 | ABP Desam

Continues below advertisement

ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 చెన్నైలో ప్రారంభమైంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ఏబీపీ నెట్ వర్క్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ, ఏబీపీ నెట్ వర్క్ సీఈవో సుమంతా దత్తా జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. రేపటి భారతావని భవిష్యత్తు కోసం దక్షిణాది రాష్ట్రాల ప్రముఖులంతా ఈ సదస్సులో చర్చించనున్నారు. మేధస్సు ఆవిష్కరణలుగా మారే ప్రాంతంగా నిలిచిన దక్షిణ భారత దేశం, ప్రకృతి పర్యాటకానికి చిరునామాగా నిలవటంతో పాటు ఆర్థిక ప్రగతికి సహకరించే పారిశ్రామిక పురోగతికి దోహద పడే విషయాలపై వక్తలంతా చర్చించనున్నారు. కళకు కాణాచిగా..ప్రపంచం తిరిగి చూస్తున్న కథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది దక్షిణాది రాష్ట్రాల గురించి రేపటి భారతావని నిర్మాణం కోసం ఏకమైన దక్షిణాది..ఆ మార్గదర్శకుల చర్చలకు వేదికంగా నిలిచింది ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ జ్యోతి ప్రజ్వలన తర్వాత సదరన్ రైజింగ్ సమ్మిట్ పై డీఎంకే ప్రభుత్వం తరపున అభిప్రాయాన్ని తెలియచేశారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola