ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam

 ఏబీపీ నెట్వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సు ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ఏబీపీ నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్,  ఏబీపీ నెట్ వర్క్ డైరెక్టర్ ధృబ ముఖర్జీ, ఏబీపీ నెట్ వర్క్ సీఈవో సుమంత దత్తా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
దేశంలో అత్యున్నత స్థాయి నేతలు, పాలసీ మేకర్స్, పారిశ్రామిక వేత్తలు, కళాకారులు, మార్పు కోరుకునే మేధావుల కు వేదికగా ఏబీపీ నెట్వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సు నిలవనుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఉజ్వల భవిష్యత్ భారతం దిశగా ఎన్నో మేథోపరమైన చర్చలు జరగనున్నాయి. రాజకీయాల నుంచి ఆర్థిక రంగం వరకూ...పాలన నుంచి విన్నూత్న ఆవిష్కరణల వరకూ...సంప్రదాయాలు కళల నుంచి అంతర్జాతీయ దౌత్యవిధానాల వరకూ అనేక అద్భుతమైన, ఆలోచింపచేసే చర్చలకు ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 వేదికగా నిలవనుంది. అనేక ఆసక్తికర చర్చలకు సరైన సిసలైన వేదిక గా మారనుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola