ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam

 ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సు ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రారంభోపన్యాసాన్ని ఏబీపీ నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ చేశారు. ప్రపంచ వాణిజ్యంతో ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుతుందని అతిదేబ్ సర్కార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

"భారత్ ఎప్పుడూ యుద్ధాలు కోరుకోదు. మన వస్తువులను, సేవలను కొనుగోలు చేసుకునే దేశాలతో మన దేశం వర్తక వాణిజ్యాలను పెంచాలి. మన దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించగలిగే వారి కోసం రెడ్ కార్పెట్ పరచాలి.

ఉపఖండాన్ని యుద్ధం తాకింది. వైట్ హౌస్ విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేశాయి; వాటిని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత్, యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అదే సమయంలో, ఆ ఒప్పందాన్ని భారత రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గాజా ఇప్పటికీ మంటల్లోనే ఉంది. వెనిజువెలాలో పాలన మార్పు జరిగింది. ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పలు ప్రయత్నాలు జరిగినా శాంతి స్థాపన ఇంకా జరగలేదు. " - అతిదేబ్ సర్కార్, చీఫ్ ఎడిటర్, ఏబీపీ న్యూస్ నెట్ వర్క్

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola