Hyderabad Child Selling Rocket | హైదరాబాద్ లో పోలీసులకు చిక్కిన పిల్లలను అమ్మే ముఠా | ABP Desam

Continues below advertisement

మీకు పిల్లలు లేరా..సంతాన సాఫల్యత కోసం ఆ క్లినిక్ కి వెళ్తే చాలు..పుట్టిన పిల్లల్నే అంగట్లో సరకుల్లా అమ్మేస్తారు. పాప,బాబు ఎవరు కావాలన్నా అమ్ముతారు.రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకూ వసూలు చేస్తారు. ఆ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకువస్తారో తెలియదు. వివరాలు అడిగినా చెప్పరు. అలాంటి ఓ ముఠా పోలీసులకు చిక్కింది. ఇది ఎక్కడో జరిగింది కాదు హైదరాబాద్ లోనే. హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో తవ్వే కొద్ది విస్తుపోయే విషాయాలు వెలుగులోకి వస్తున్నాయి. బయట వ్యక్తులకు అనుమానం రాకుండా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కోడ్ భాషలో మాట్లాడుకొని రేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత పిల్లలను ఆయా వ్యక్తులకు ఇచ్చే వాళ్లు. ఇలా ముక్కుపచ్చలారని చిన్నారులను కన్నవారి దగ్గర నుంచి మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన చిన్నపిల్లల అమ్మకాల దందా కేసు చిన్నది కాదు. వీళ్లకు భారీ స్థాయిలో నెట్‌ వర్క్ ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో చిన్నారులను తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ఈ కేసులో కేంద్రబిందువుగా ఉన్న ఆర్‌ఎంపీ శోభారాణి మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్ తిన్నారు. తన ఇల్లు, క్లినిక్‌ను కేంద్రంగా చేసుకొని కోట్ల బిజినెస్ చేశారామె. కాసుల ఆశ  చూపి కన్నవారికి, పిల్లల ఆశ చూపి కొన్న వారిని నిలువునా ముంచేసింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram