GO 317 Arrests: ప్రతిపక్షాల పరామర్శ పర్యటనకు పోలీసుల అడ్డంకులు
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న నేతలను పలుచోట్ల పోలీసుల అరెస్టు చేశారు. బాబాపూర్ కు చేరుకోకముందే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కమ్మర్ పల్లి వద్ద అరెస్ట్ చేశారు. భాజపా నాయకుడు మల్లికార్జున్ రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచారు. నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ కమ్మర్ పల్లి మండల కేంద్రంలో జాతీయరహదారిపై ధర్నా నిర్వహించారు.