Fight between TRS & BJP Leaders: ఇస్సాపల్లిలో దాడులకు దిగిన ఇరుపార్టీల నేతలు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. TRS, BJP నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎంపీ ధర్మపురి అర్వింద్ నందిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటనకు వెళ్తుంటే పసుపు రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పసుపు బోర్డు హామీ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆర్మూర్ రోడ్డులో అర్వింద్ బైఠాయించారు. అనంతరం ఇస్సాపల్లి వెళ్తుండగా.... పసుపు రైతులు అర్వింద్ ను అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు భారీగా రావటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.