Elon Musk New Party | కొత్త పార్టీ ప్రకటించిన ఎలాన్ మస్క్

అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొంది, చట్టంగా మారేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. ‘ద అమెరికా పార్టీ’ని స్థాపిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. మస్క్ తాజా నిర్ణయంతో అటు రిపబ్లికన్ పార్టీ, ఇటు డెమొక్రాట్లను సైతం టెన్షన్‌ పెడుతోంది. 

రాయితీలు కట్ చేసేలా తెచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఎలాన్ మస్క్ వ్యతిరేకం. ఆ బిల్లుకు అమెరికా సెనెట్, ఆపై ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయడంతో ఆ బిల్లు చట్టంగా మారింది. ఈ కీలక సమయంలో ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ‘ద అమెరికా పార్టీ’ని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.

శతాబ్ధాల నుంచి రిపబ్లికన్ పార్టీ, డెమొక్రాటిక్ పార్టీల పాలన చూసిన అమెరికా ప్రజలు మార్పు కోసం చూస్తే కనుక ఎలాన్ మస్క్ పార్టీ దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ కానుంది. వ్యాపారంలో బిజీగా ఉండే మస్క్ రాజకీయ పార్టీని సమర్థవంతంగా నిర్వహించగలగారా, అందుకు సమయం కేటాయించగలరా అనే అనుమానాలు సైతం అమెరికా ప్రజల్లో ఉన్నాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola