Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉన్న ఏనుగుల శిబిరంలో అత్యంత అరుదైన వైద్య ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రమాదంలో కాలు విరిగి, నడవలేని స్థితిలోకి వెళ్లిన ద్రోణ అనే ఏనుగుకు వెటర్నరీ వైద్యులు ఫైబర్‌గ్లాస్ కాస్టింగ్ సాంకేతికతతో వైద్యం అందించి మళ్లీ సొంత కాళ్లపై నిలబడేలా చేశారు.
భారీ శరీర బరువు కలిగిన ఏనుగులకు కాలి ఎముక విరిగితే కోలుకోవడం అత్యంత సంక్లిష్టమైన విషయం. అలాంటిది సక్రెబైలు క్యాంప్ వైద్యాధికారుల బృందం చాకచక్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు ప్రత్యామ్నాయంగా అత్యంత బలమైన ఫైబర్‌గ్లాస్‌తో ప్రత్యేక కట్టు కట్టి గజరాజుకు మళ్లీ నడిచే అవకాశం కల్పించారు.
ధారణంగా ఏనుగుల బరువు చాలా ఎక్కువగా ఉండటం వల్ల విరిగిన కాలికి కట్టు వేయడం, అది స్థిరంగా ఉండేలా చూడటం క్లిష్టమైన సవాలు. అందుకే ఫైబర్‌గ్లాస్ కాస్టింగ్ మెథడ్‌ను ఉపయోగించారు. ఇది తేలికగా ఉంటూనే టన్నుల కొద్దీ ఒత్తిడిని తట్టుకోగలదు.
ద్రోణకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ, పౌష్టికాహారం, నొప్పుల నివారణ మందులు అందించారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణతో ద్రోణ కాలి ఎముక విజయవంతంగా అతుక్కుని, ప్రస్తుతం అది సాధారణంగా అడుగులు వేస్తోంది.
ఫైబర్‌గ్లాస్ కట్టుతో ఉన్న ఏనుగు ద్రోణ సురక్షితంగా నడవడం అందర్నీ ఆకర్షిస్తోంది. ఏనుగుల సంరక్షణ, వైద్య చరిత్రలోనే ఈ ఫైబర్‌గ్లాస్ ప్రయోగం ఒక సరికొత్త రికార్డుగా నిలిచింది.