Dwarf Galaxy BlackHole: కీలక విజయం సాధించిన నాసా ఎక్స్ రే అబ్జర్వేటరీ ' చంద్ర'
స్పేస్ అబ్జర్వేటరీలో నాసా ఓ కీలక విజయాన్ని నమోదు చేసింది. తొలి సారి ఓ మరగుజ్జు గెలాక్సీకి బ్లాక్ హోల్ ను గుర్తించింది నాసాకు చెందిన ఎక్స్ రే అబ్జర్వేటరీ ' చంద్ర'. భూమి నుంచి 110మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించిన MRK462 మరగుజ్జు గెలాక్సీ పక్కనే దీనిని గుర్తించారు. మన పాలపుంతతో పోలిస్తే వందరెట్లు చిన్న గెలాక్సీగా ఈ MRK462ను పరిగణించే శాస్త్రవేత్తలు...ఈ ఇప్పుడు ఈ ఆవిష్కరణతో తొలితరం బ్లాక్ హోల్స్ కదలికలపై అధ్యయానికి వీలవుతుందని చెబుతున్నారు. గెలాక్సీల పుట్టుకకు, అంతానికి బ్లాక్ హోల్ కారణంగా భావించే శాస్త్రవేత్తలు వాటి గుట్టు విప్పేందుకు కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చంద్ర సాధించిన ఈ విజయాన్ని ఓ కీలక పరిణామంగా అభివర్ణిస్తున్నారు. ఇంతకీ నాసా అబ్జర్వేటరీకి చంద్ర పేరేంటని సందేహం మీకు రాలేదా...అదేనండీ భారతీయ అమెరికన్ ప్రఖ్యాత గణితవేత్త సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గౌరవార్థంగా తన ఎక్స్ రే అబ్జర్వేటరీకి చంద్ర పేరు పెట్టింది నాసా.