Dummy Gun hulchul: తూర్పుగోదావరి జిల్లా చల్లపల్లి మరిడమ్మ జాతరలో డమ్మీగన్ తో హడావిడి

Continues below advertisement

గబ్బర్‌సింగ్‌లో పవన్‌కళ్యాణ్‌లా బిల్డప్‌ ఇచ్చాడు.. బొమ్మ తుపాకీతో హల్‌చల్‌ చేశాడు.. జాతరలో ఎర్ర రుమాలు తలకు కట్టుకుని చేత్తో గన్‌ పట్టుకుని రెచ్చిపోయాడు.. అది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.. కొన్ని మీడియాల్లో జాతరలో గన్‌తో ఓ యువకుడు హల్‌చల్‌ అంటూ బ్రేకింగ్‌లు పడ్డాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.. కాకినాడలోని చెక్కబొమ్మల ఎగ్జిబిషన్‌లో కొన్న బొమ్మ తుపాకీతో బిల్డప్‌ ఇచ్చాడని తేల్చారు. బొమ్మతుపాకీని స్వాధీనం చేసుకుని ఆ యువకుడు పోలిశెట్టి శివగంగాధర్ పై బైండోవర్‌ కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి మరిడమ్మ జాతర మహోత్సవంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబందించి జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్‌బాబు రంగంలోకి దిగాల్సి వచ్చింది.. వెంటనే ఇంఛార్జి డీఎస్పీ ఎస్‌.రాంబాబుకు ఆదేశాలిచ్చారు. దీంతో ఉరుకులు పరుగులతో విచారణ చేసిన పోలీసులు చివరకు యువకుడు హల్‌చల్‌ చేసిన గన్‌ బొమ్మతుపాకీనేనని తేల్చారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram