Drones Play :డ్రోన్లతో భారతదేశం మ్యాప్, మహాత్మా గాంధీ చిత్రం వాహ్ వా అనిపించినా విన్యాసాలు
భారతదేశంలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌లో భారత సంస్కృతి, సైనిక పటిమను దేశమంతా తిలకించింది. పగటిపూట, అందమైన టేబుల్‌లాక్స్ ప్రజలను ఆకర్షించింది. ఇదిలా ఉండగా సాయంత్రం 'విజయ్ చౌక్' వద్ద డ్రోన్‌ల సందడి మొదలైంది. భారతదేశం మ్యాప్, మహాత్మా గాంధీ చిత్రంతో సహా అనేక విషయాలు ఆకాశంలోనే చెక్కారు. సుమారు 10 నిమిషాల పాటు, ఈ డ్రోన్ల షో సాగింది. ఒకదాని వెంట మరొకటి డ్రోన్లు చేస్తున్న విన్యాసాలకు సంబంధించి మనోహరమైన దృశ్యాన్ని ప్రజలు కన్నార్పకుండా చూశారు.