ఎపీని కేంద్రం నిలువునా ముంచింది.. సీపీఐ నేత రామకృష్ణ
విజయవాడలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా ఎంపీలలో చలనం లేదని ఎద్దేవా చేశారు. విభజన హామీలు అమలు చేయకపోగా ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తున్నామని పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు మాయమాటలు చెబుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను జగన్ కేంద్ర పెద్దలను కలిసి వివరించాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు నిర్ణయం తీసుకోవాలన్నారు.