Covid in Telangana : పాజిటివిటీ 10 శాతం లోపు ఉంటే కర్ఫ్యూ అక్కర్లేదన్న డీహెచ్
Telanganaలో రాత్రి Curfew విధించేంత తీవ్రంగా కరోనా వ్యాప్తి లేదని డీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. పాజిటివిటీ రేటు పది శాతం దాటితేనే కర్ఫ్యూ అవసరమన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని తెలిపారు. ఏ జిల్లాలోనూ పది శాతం దాటలేదని ప్రస్తావించారు. మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం పాజిటివిటీ ఉందని, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతం ఉందని స్పష్టం చేశారు.