Corona Scare: పార్లమెంట్ లో కరోనా కలకలం
మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో ఉన్న 1409 మంది సిబ్బందిలో 400 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అవటంతో కలకలం రేగింది. వీరంతా ఐసోలేషన్ లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్టు వెల్లడించారు. బాధితులకు కాంటాక్ట్ లోకి వచ్చినవారు సైతం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.