CM Jagan: సీఎం జగన్ కు శారదాపీఠం వార్షిక మహోత్సవ ఆహ్వానపత్రిక
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసంలో ఆయనను విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి కలిశారు. శారదాపీఠం వార్షిక మహోత్సవ ఆహ్వాన పత్రికను జగన్ కు అందజేశారు. అనంతరం సీఎంకు వేదాశీర్వచనం అందించారు. ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు శారదాపీఠంలో ఈ వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. స్వాత్మానందేంద్ర సరస్వతితో వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.