Chopper Tailspin in Kedarnath Viral Video | కేదార్‌నాథ్ లో అదుపుతప్పి గింగిరాలు కొట్టిన హెలికాప్టర్

కేదార్‌నాథ్‌లో ఆరుగురు ప్యాసింజర్స్‌తో టేకాఫ్ అయిన హెలికాప్టర్‌ ఉన్నట్టుండి గాల్లో గిరగిరా తిరిగిపోయింది. చాలా సేపటి వరకూ అలా గాల్లో గింగిరాలు కొట్టింది. అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నారు. కాసేపటికి పైలట్‌ చాపర్‌ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. కేదార్‌నాథ్‌ హెలిప్యాడ్ నుంచి 100 మీటర్ల దూరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. పైలట్‌తో పాటు ఆరుగురు ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారు. అయితే...హెలికాప్టర్‌ గాల్లో చక్కర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జరిగినప్పుడు హెలిప్యాడ్ వద్ద ఉన్న మిగతా ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. కూలిపోతుందేమోనని ఆందోళన చెందారు.

 

సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. కేదార్‌నాథ్‌ హెలిప్యాడ్ నుంచి 100 మీటర్ల దూరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. పైలట్‌తో పాటు ఆరుగురు ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారు. అయితే...హెలికాప్టర్‌ గాల్లో చక్కర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola