Chiranjeevi : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు పాజిటివ్ వచ్చిందన్న చిరు
కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు,కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర, బుల్లితెర నుంచి కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా కరోనా బారిన పడిన చిరంజీవి,ఈ విషయాన్ని ట్వీట్ చేశారు..పాజిటివ్ వచ్చిన విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలియజేశారు చిరంజీవి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు పాజిటివ్ వచ్చిందని.. స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడినట్టు పోస్ట్ చేశారు.ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానన్న చిరంజీవి,గత రెండు మూడు రోజులుగా తనను కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోవాలి సూచించారు.