Chandrababu Final Respects to Ramoji Rao | రామోజీరావుకు అశ్రునివాళులు అర్పించిన చంద్రబాబునాయుడు

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు భౌతిక కాయానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాళులు అర్పించారు. రామోజీ మరణ వార్త విని ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు హుటాహుటిన బయల్దేరి వచ్చిన చంద్రబాబు..తన భార్య భువనేశ్వరితో కలిసి రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు. రామోజీ రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు...ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు భౌతిక కాయానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాళులు అర్పించారు. రామోజీ మరణ వార్త విని ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు హుటాహుటిన బయల్దేరి వచ్చిన చంద్రబాబు..తన భార్య భువనేశ్వరితో కలిసి రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు. రామోజీ రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు...ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ  సానుభూతి తెలియచేశారు.ఆయన పత్రికలో తెలుగుకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. తెలుగు వాళ్ల జీవితంలోకి చొచ్చుకు వస్తున్న ఆంగ్ల పదాల స్థానంలో తెలుగు పదాలనే వాడమని రామోజీ రావు ఆయన పాత్రికేయులకు సూచించేవారు. చదవటానికి ఇబ్బందిగా ఉన్నా భాషను బతికించుకోవాలంటే అదొక్కటే దారి అని ఆయన భావించేరావు. అలా అనేక విలువలతో ఈనాడు పత్రిక తెలుగు వాళ్ల జీవితంలో ఓ భాగంగా మారి తెలుగు మీడియా రంగంలో నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola