Chandrababu: కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. కుప్పం మండలం దాసీగానూరు గ్రామంలో ఆయన పర్యటించారు. చెరువు కట్టను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత రచ్చబండలో పాల్గొన్నారు. తాను ప్రజలతో తూతూ మంత్రంగా మాట్లాడబోనని, మనస్ఫూర్తిగా మాట్లాడేందుకే వచ్చానన్నారు. తెలుగుదేశం బహిష్కరించిన స్థానిక ఎన్నికల్లో గెలిచి వైకాపా వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. తన నియోజకవర్గంలో ఆగడాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన చంద్రబాబు.... తాను తల్చుకుంటే ఎవరూ రోడ్లపై తిరగరని హెచ్చరించారు. ఓటీఎస్ విధానాన్ని మళ్లీ తీవ్రంగా తప్పుబట్టారు. నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యులను కోలుకోలేని స్థితికి తెచ్చారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola