Bandra: ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం.. ఏడుగురిని కాపాడిన సిబ్బంది
ముంబై సబర్బన్ బంద్రాలో ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఐదుగురు చిక్కుకున్నట్లు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకుని అధికారులకు సమాచారమిచ్చారు. ఇప్పటివరకు ఏడుగురిని సహాయక సిబ్బంది రక్షించి దగ్గర్లోని రెండు ఆసుపత్రులకు తరలించినట్లు బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎమ్‌సీ) తెలిపింది.