Bandi Srinivasa Rao: జీతాల విషయంలో కలెక్టర్లు ఒత్తిడి చేయటం సరికాదు
ఉద్యోగుల డిమాండ్లు ఆమోదిస్తేనే ప్రభుత్వంతో చర్చలకు వెళ్తామని పీఆర్సీ సాధన కమిటీ నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. శాంతియుతంగా ఉద్యోగులు నిరసనలు తెలుపుతుంటే ప్రభుత్వం రెచ్చగొట్టేలా మాట్లాడుతుందని, ఈ ప్రవర్తనను సరిచేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓలకు ఉద్యోగులు తమకు పాత జీతాలని ఇవ్వాలని రిప్రజంటేషన్సు ఇస్తారన్నారు. ప్రతీ ఉద్యోగికి తాము ఏ పీఆర్సీ ప్రకారం జీతం తీసుకోదలచుకున్నారో చెప్పే హక్కు ఉందన్నారు. కొందరు కలెక్టర్లు జీతాల విషయంలో డీడీఓలపై ఒత్తడి తీసుకు వస్తున్నారని, ఇది సరైనది కాదన్నారు. ఉద్యోగుల కోపానికి కలెక్టర్లు ఆహుతి కావద్దని హెచ్చరించారు. ప్రభుత్వం పాత జీతం మీద కొత్త డీఏలు వేస్తే జీతాలు ఎంత తేడాలు వస్తాయో ప్రభుత్వానికి అర్దం అవుతుందన్నారు.