Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి

ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన డ్రోన్ దాడులు, ఎయిర్ స్ట్రైక్స్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీతో పాటు నలుగురు కుటుంబ సభ్యులు కూడా మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఖమేనీ మృతిచెందారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అధినేత ఖమేనీ మరణం తర్వాత 40 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ పలు అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.   అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్'లో సంచలన ప్రకటన చేశారు. ఒక సైనిక ఆపరేషన్‌లో 86 ఏళ్ల అయతుల్లా అలీ ఖమేనీ  మరణించారని పేర్కొన్నారు. ఇరాన్ చరిత్రలో ఖమేనీ అత్యంత చెడ్డ వ్యక్తులలో ఒకరని, ఆయన మరణం న్యాయసమ్మతమని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.                       

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola