Archery Training : కామారెడ్డి జిల్లా దోమకొండలో ఉచిత విలువిద్య శిక్షణ
ఆర్చరీ.. మన దేశంలోని క్రీడల్లో ఖరీదైన వాటిలో ఇదొకటి. కేవలం విల్లు ఒక్కటే కొనాలంటేనే దాదాపు లక్ష రూపాయలకుపైగా ఖర్చు అవుతుంది. ఇంత వ్యయం ఉండటం వల్ల ఆసక్తి ఉన్నప్పటికీ చాలా మంది పిల్లలు అటువైపు అడుగు వేయలేకపోతున్నారు. కానీ ఈ విషయంలో కామారెడ్డి జిల్లా దోమకొండ కోట విభిన్నం. ఘన చరిత్ర కలిగిన ఈ కోట ఒకప్పుడు కామినేని వంశీయుల అధీనంలో ఉండేది. ఇప్పుడు అదే వంశానికి చెందిన అనిల్, శోభ దంపతులు.... కోటలో ఉచిత విలువిద్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆర్చరీ నేర్చుకునేందుకు పిల్లలు తరలివస్తున్నారు.