AP- Sachivalayam: రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతటా మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమను ప్రభుత్వం మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. ప్రొబేషన్ డిక్లరేషన్ తేదీని పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విధులకు హాజరవకుండా తమ నిరసనను కొనసాగిస్తున్నారు.