AP Inter Results 2022| ఏపీ ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ - చివరి స్థానంలో కడప జిల్లా
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ. ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెగ్యూలర్ ఫలితాలతో పాటు ఒకేషనల్ ఫలితాలను మంత్రి విడుదల చేశారు. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 75 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 55 శాతం మంది పాస్ అయినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
Tags :
Education Students ANDHRA PRADESH AP Inter Exams Intermediate Exams AP Inter Exam Results 2022