AP Employees Union: మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు అసంపూర్తి | ABP Desam
మంత్రి బొత్స సత్యనారాయణ తో సీపీఎస్ ఉద్యోగ సంఘాల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. జీపీఎస్ ను అంగీకరించాలని ఉద్యోగ సంఘాలపై మంత్రుల కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుత పరిస్థితుల్లో.. పాత పెన్షన్ స్కీం అమలు చేయటం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఉద్యోగులు జీపీఎస్ కు అంగీకరించి, సహకరించాలని మంత్రుల కమిటీ సూచించింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాత్రం.. ఈ ప్రతిపాదనలపై విముఖత వ్యక్తం చేశారు. దీంతో..రేపు మరోసారి ఉద్యోగ సంఘాలను మంత్రుల కమిటీ చర్చలకు ఆహ్వానించింది.