వర్చువల్ గా ప్లాంట్లు ప్రారంభం.. అత్యాధునిక వైద్య పరికరాల పర్యవేక్షణ
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లను సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసిన అత్యాధుని వైద్య పరికరాలను పరిశీలించారు. ఆ పరికరాల పనితీరును వైద్య నిపుణులను అడిగి తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా రూ.426 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్‌పీఎం సామర్ధ్యం గల 144 పీఎస్‌ఏ ప్లాంట్లతో సహా క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఎల్‌ఎంఓ ట్యాంకులు, ఆక్సిజన్ పైపులైన్లు ఇతర మౌలిక సదుపాయాలను సీఎం ప్రారంభించారు.
Continues below advertisement