స్నేహితులతో దుబాయ్ లో ఆండ్రియా 36వ పుట్టినరోజు వేడుకలు
నటి ఆండ్రియా జెరమియా తెలుగు, తమిళ చిత్రాల్లో బోల్డ్ గా నటిస్తూ తనదైన పేరు సంపాదించుకుంది. వీటితో పాటు మలయాళంలోనూ యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తూ బోల్డ్ స్టార్ గా నిలిచింది. అయితే ఇటీవల ఆండ్రియా తన 36వ పుట్టినరోజును దుబాయ్ లో ఓ ఖరీదైన హోటల్ లో జరుపుకున్నారు. తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని కేక్ కట్ చేసారు. ఈ కేక్ ను పంపించినవారికి ఆండ్రియా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇంతకీ ఆ కేక్ పంపించింది ఎవరు అనుకుంటున్నారా? అది ఎవరో కాదండి.. దుబాయ్ లో తాను నివసించిన హోటల్ యాజమాన్యం. ఇదే విషయాన్నీ తెలుపుతూ ఆండ్రియా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.